‘థగ్ లైఫ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం కలయికలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ చిత్రం నాయకుడు సినిమా తర్వాత వస్తున్న అవైటెడ్ సినిమానే ‘థగ్ లైఫ్’. అయితే ఈ చిత్రం విడుదలకి ముందే పలు కాంట్రవర్సీలు తప్పలేదు. ఇలా మొత్తానికి థియేటర్స్ లో రిలీజ్ కి ఈ చిత్రం రాగా సినిమా టాక్ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి మరీ అంత భారీ హైప్ అయితే కనిపించలేదు.

దీనితో ఓ మాదిరి బుకింగ్స్ నే దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం రిజిస్టర్ చేస్తుంది. ఇలా డే 1 కి వసూళ్ల ప్రిడిక్షన్ కూడా ఇప్పుడు చూసినట్టు అయితే ఇప్పుడున్న ట్రెండ్ లో కమల్ గత చిత్రం ఇండియన్ 2 ఓపెనింగ్స్ 50 కోట్లని కూడా ఈ చిత్రం అందుకునే ఛాన్స్ లేదు అన్నట్టే వినిపిస్తోంది. సుమారు 50 కోట్ల మేర మాత్రమే వచ్చే ఛాన్స్ ఉన్నట్టు వినిపిస్తుంది. మరి మేకర్స్ ఎంత అనౌన్స్ చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించగా శింబు, త్రిష తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version