లింగుస్వామి దర్శకత్వంలో నటించనున్న యూనివర్సల్ హీరో

లింగుస్వామి దర్శకత్వంలో నటించనున్న యూనివర్సల్ హీరో

Published on May 27, 2013 8:05 PM IST

Kamal-and-Lingu-Sami
కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’ సినిమా విడుదలకు ముందే మరో సినిమాను అంగీకరించాడు. తాజా సమాచారం ప్రకారం యాక్షన్ డ్రామాగా సాగే ఈ సినిమాను లింగుస్వామి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చెయ్యలేదు. గత కొన్ని రోజులుగా తిరుపతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై లింగుస్వామి వివిధ కధలతో కమల్ ను సంప్రదించగా ఆ కధలను విని మన కమల్ చాలా ఆసక్తికి లోనయ్యాడట. ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ యేడాది అక్టోబర్లో సినిమా విడుదల కావచ్చు. తారలు తదితర వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

తాజా వార్తలు