విజయ్‌కు సలహా ఇవ్వలేను – కమల్ హాసన్

విజయ్‌కు సలహా ఇవ్వలేను – కమల్ హాసన్

Published on Dec 1, 2025 9:00 AM IST

kamal-haasan--vijay

తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రస్తుతం రాజకీయాల పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఐతే, తాజాగా తాను విజయ్‌ కు సలహా ఇచ్చే స్థితిలో లేనని సీనియర్ హీరో, రాజ్యసభ ఎంపీ కమల్‌ హాసన్‌ చెప్పుకొచ్చారు. కమల్ అసలు ఏం మాట్లాడారు అంటే.. ‘అనుభవం మన కన్నా గొప్ప గురువు. అది నేర్పే పాఠాలు ఎవరూ నేర్పించలేరు. మనుషులకు పక్షపాతం ఉండొచ్చు గానీ అనుభవానికి ఉండదు’ అంటూ కమల్ కామెంట్స్ చేశారు.

కమల్ ఇంకా మాట్లాడుతూ.. విజయ్ నాకు సోదరుడు లాంటి వ్యక్తి. అలాంటి విజయ్‌కు సలహా ఇచ్చేందుకు ఇది సరైన సమయం కూడా కాదు’ అని కమల్ తెలిపారు. ‘2026లో నిర్వహించనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేయనున్న విజయ్‌కు సలహాలిస్తున్నారా?’ అన్న ప్రశ్నకు కమల్ హాసన్ ఇలా సమాధానం ఇచ్చారు. తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ పోటీ చేయనున్నారు.

తాజా వార్తలు