ఇటీవల దక్షిణాది సినిమా దగ్గర అనౌన్స్ అయ్యిన క్రేజీ కాంబినేషన్ సినిమానే సూపర్ స్టార్ రజినీకాంత్ అలానే కమల్ హాసన్ నిర్మాతగా అనౌన్స్ చేసిన సినిమా అని చెప్పాలి. రజినీకాంత్ కెరీర్ లో 173వ సినిమాగా దర్శకుడు సుందర్ సి తో ఈ సినిమాని ఘనంగా అనౌన్స్ చేశారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా నుంచి దర్శకుడు తప్పుకున్నట్టుగా రివీల్ చేశారు.
మరి దీనిపై లేటెస్ట్ గా నిర్మాత కమల్ హాసన్ ఓపెన్ అయ్యారు. సుందర్ సి తీసుకున్న నిర్ణయం అందరికీ తెలుసు తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ కొలాబరేషన్ మళ్ళీ జరగదు. నిర్మాతగా నా హీరోకి నచ్చే కథ తోనే నేను ముందు వెళ్తాను ఇప్పుడు పనుల్లోనే ఉన్నాము మంచి కథ దొరినపుడు ఖచ్చితంగా సినిమా మొదలవుతుంది అని కమల్ అసలు క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు కొత్త కథ, కొత్త దర్శకుడు కూడా అవసరం ఉంది అని చెప్పాలి.


