300 కోట్ల గ్రాస్ తో చరిత్ర సృష్టించిన యంగ్ హీరోయిన్

Kotha-Lokah-2

రీసెంట్ గా వచ్చి సెన్సేషన్ ని సెట్ చేసిన చిత్రాల్లో ఒకటే లోక చాప్టర్ 1. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిన్ ప్రధాన పాత్రలో యువ హీరో నెస్లన్ నటించిన ఈ చిత్రాన్ని డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. మలయాళ సినిమా నుంచే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర ఒక సరికొత్త సూపర్ హీరో సినిమాగా అందులోని మొదటి ఫీమేల్ సూపర్ హీరోయిన్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం వసూళ్ల పరంగా కూడా అదరగొట్టింది.

ఇలా మలయాళ సినిమా దగ్గర కొత్త నంబర్స్ సెట్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ నిలిచిన ఈ సినిమా లేటెస్ట్ గా 300 కోట్ల గ్రాస్ ని అందుకొని మరో హిస్టరీ క్రియేట్ చేసింది. దీనితో మన సౌత్ లో ఇలాంటి ఇండస్ట్రీ హిట్ ఉన్న హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శిన్ హిస్టరీ సెట్ చేసింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మాణం వహించగా ఈ ఫ్రాంచైజ్ లో మరిన్ని రానున్న సంగతి తెలిసిందే.

Exit mobile version