నాకు కథ నచ్చితే చాలు : కాజల్


కాజల్ అగర్వాల్ కేవలం అందమైన అమ్మాయి మాత్రమే కాదు, తెలివైన మరియు ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయి. ఎన్ని చిత్రాల్లో నటించామన్నది కాదు, ఎన్ని విజయవంతమైన సినిమాల్లో నటించామన్నదే మిఖ్యం అంటుంది కాజల్. ఈ ఏడాది ఇన్ని సినిమాల్లో నటించాలి అని ఎప్పుడు ప్రణాళికలు, లెక్కలు లాంటివి పెట్టుకోను అనీ, నాకు కథ నచ్చితే సరిపోతుంది. ఆ సినిమా కథ ప్రేక్షకులకు చేరుతుందా? నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుందా? ఆ పాత్ర ప్రేక్షకులకు చేరువవుతుందా? ఇలాంటి చిక్కు ప్రశ్నలు పెట్టుకుని బుర్ర పడు చేసుకోవడం నాకిష్టం ఉండదు అంటోంది. కాజల్ ప్రస్తుతం మహేష్ బాబు సరసన సుకుమార్ డైరెక్షన్లో రానున్న సినిమాలో మరియు రామ్ చరణ్ సరసన వివి వినాయక్ సినిమాల్లో నటిస్తుంది.

Exit mobile version