ధనుష్ సరసన ఒక తమిళ సినిమాలో నటించడానికి కాజల్ అంగీకరించింది. వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ధనుష్ ఆర్ బల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ మరియు అక్షరా హాసన్ తో కలిసి నటిస్తున్నాడు
వచ్చే యేడాది కాజల్ మూడు తమిళ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలే కాక వంశీ దర్శకత్వంలో వెంకటేష్, రామ్ చరణ్ ల సరసన ఒక సినిమాలో నటిస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే ‘మగధీర’, ‘నాయక్’ సినిమాల తరువాత మరోసారి హిట్ పెయిర్ గా కనిపిస్తారేమో…