అందరినీ మరచిపోతున్న బిజీ బిజీ కాజల్


తెలుగు మరియు తమిళంలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ గుర్తు పెట్టుకోవాల్సిన పేర్లు కూడా గుర్తు పెట్టుకోవడం లేదంట. ఉదాహరణకి ఆమె పనిచేసే సినిమా దర్శకుల పేర్లు, నిర్మాతల పేర్లు మొదలైన వారి పేర్లు మరచిపోయి ఒకరి పేరుతో వేరొకరిని పిలిచేసి తర్వాత నాలిక్కరుచుకొని వారికి క్షమాపణలు చెప్పుకుంటోంది. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ‘తుపాకి’ ఆడియో ఫంక్షన్లో ఈ చిత్ర దర్శకుడు ఎ.ఆర్ మురుగదాస్ అన్నారు. ఈ ఆడియో వేడుకలో మురుగదాస్ మాట్లాడుతూ ‘ కాజల్ తెలుగు, తమిళ సినిమాల షూటింగుల్లో బిజీగా ఉండి అక్కడికీ ఇక్కడికీ తిరుగుతూ ఉండడం వల్ల ఈ సినిమా చేస్తున్న సమయంలో చాలా సార్లు నా పేరే మరచిపోయింది. కొత్త పేరుతో పిలిచేసరికి కొంత ఆశ్చర్యానికి గురయ్యాను. నేను చిరంజీవి గారితో తెలుగులో ‘స్టాలిన్’ సినిమా చేసాను ఆయన శైలి నాకు బాగా నచ్చింది. అలాంటి శైలిని మళ్ళీ విజయ్ లోనే చూసాను’ అని ఆయన అన్నారు. విజయ్, కాజల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి హారీష్ జైరాజ్ సంగీతం అందించారు. జెమిని ఫిలిం సర్క్యూట్ వారు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీఆర్ మీడియా వారు నవంబర్ 9 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version