ఫేస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన కాజల్ అగర్వాల్

ఫేస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన కాజల్ అగర్వాల్

Published on Nov 22, 2012 12:18 AM IST


గత మూడేళ్ళుగా తెలుగు పరిశ్రమలో ప్రధాన కథానాయికగా కొనసాగుతున్న కథానాయికలలో కాజల్ అగర్వాల్ ఒకరు. “మగధీర” చిత్రం భారీ విజయం ఆడించిన తరువాత ఈ భామ టాలీవుడ్లో ప్రధాన కథానాయికగా మారింది తరువాత “డార్లింగ్”,”బృందావనం”,”ఆర్య 2″ వంటి చిత్రాలతో తన స్టార్ ఇమేజ్ ని మరింత పెంచుకుంది. తాజాగా బాలివుడ్ లో తన మొదటి చిత్రం “సింగం” విజయం సాదించడంతో తన బాలివుడ్లోకూడా తన ఉనికిని చాటింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో కూడా తనదయిన ఆధిపత్యాన్ని ఈ భామ కొనసాగిస్తుంది ఫేస్ బుక్లో ఈ భామ పేజి కి పది లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు మరే కథానాయిక ఈ సంఖ్యకి దరిదాపుల్లో లేదు. ప్రస్తుతం ఈ భామ తెలుగు మరియు హిందీలలో చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటుంది.డిసెంబర్లో రానున్న “సరోచ్చారు” జనవరి లో రానున్న “నాయక్” మరియు 2013 వేసవిలో రానున్న “బాద్షా” చిత్రాలలో ఈ భామ కనిపించనుంది.

తాజా వార్తలు