స్విట్జర్ల్యాండ్ లెటర్ చూసి ఆనందంలో ఉన్న కాజల్ అగర్వాల్

స్విట్జర్ల్యాండ్ లెటర్ చూసి ఆనందంలో ఉన్న కాజల్ అగర్వాల్

Published on Jan 17, 2014 8:00 PM IST

Kajal-Agarwal
సౌత్ ఇండియాలో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు తెరపై కనిపించి చాలా కాలం అయినప్పటికీ తమిళ ప్రేక్షకులను మాత్రం సంక్రాంతి రోజున జిల్లా సినిమాతో ఎంటర్టైన్ చేసింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత స్విట్జర్ల్యాండ్ నుంచి కాజల్ కి ఓ లెటర్ వచ్చింది. అది రాసింది తన అభిమాని విను. అతను తన నటన, లుక్స్ గురించి అలాగే తన సినిమాలన్నీ రెగ్యులర్ గా ఫాలో అవుతానని తనంటే ఎంత ఇష్టమో అందులో చెప్పాడు.

ఈ లెటర్ చూసి అత్యంత ఆనందానికి గురైన కాజల్ ‘నేను ఓపెన్ చెయ్యగానే విను తన ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేసిన విధానం చూసి ఎంతో ఆనందపడ్డాను. నాకు అభిమానులు పంపిన లెటర్స్ లో నాకు ఇష్టమైన వాటిల్లో ఇదొకటి. ఎప్పుడైతే అభిమానులు ఇలా ఒక నటిని ప్రోత్సహిస్తారో అప్పుడే మేము రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలమని’ చెప్పింది.

కాజల్ త్వరలోనే రామ్ చరణ్ – కృష్ణ వంశీ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో నటించనుంది. అలాగే ఓ బాలీవుడ్ సినిమాకి కూడా సైన్ చేసింది.

తాజా వార్తలు