పెద్ద మనసు చాటుకున్న చందమామ కాజల్..!

పెద్ద మనసు చాటుకున్న చందమామ కాజల్..!

Published on Apr 16, 2020 3:13 PM IST

చందమామ కాజల్ కరోనా బాధితుల సాహాయార్దం ఆర్థిక సాయం చేశారు. ఆమె కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం 2 లక్షల విరాళం ప్రకటించింది. చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ సినిమా పరిశ్రమపై ఆధారపడిన పేద కార్మికుల సహాయార్ధం ఏర్పాటు చేశారు. దీనికి అనేకం మంది హీరోలు, సినీ ప్రముఖులు విరాళాలు ఇవ్వడం జరిగింది. నేడు కాజల్ అగర్వాల్ తన వంతు సాయంగా 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది.
ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మేనేజర్ గిరిధర్ మాట్లాడుతూ సి సి సి కి గురువారం నాడు ఆర్టిజిఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసామని చెప్పారు.

ఇక ప్రస్తుతం కాజల్ తెలుగులో రెండు సినిమాలలో నటిస్తుంది. అందులో ఒకటి చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య కాగా, మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ మోసగాళ్లు ఒకటి. ఇక కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 లో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు