భీభత్సమైన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న కాళీచరణ్

భీభత్సమైన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న కాళీచరణ్

Published on Apr 23, 2013 2:20 AM IST

Kaali-Charan

ప్రవీణ్ శ్రీ సరికొత్త సినిమా ‘కాళీచరణ్’ సినీపరిశ్రమను తన వైపుకి తిప్పుకుంటుంది. ట్రైలర్ విడుదలైన నాటి నుండీ తన మార్కు సీన్లతో సినిమా లవర్స్ ని తన వైపుకు తిప్పుకుని ‘రక్త చరిత్ర’ సినిమాను గుర్తుకుతెచ్చాడు. ఈ సినిమా ఒక భీభత్సమైన ఎమోషనల్ డ్రామా రీతిలో ఇద్దరి మధ్య వైరం నేపధ్యంలో సాగే కధ. ఇప్పటి తరం అగ్ర దర్శకులైన ఆర్.జీ.వి మరియు వంశీ పైడిపల్లి మొదలగువారు ఈ సినిమా ట్రైలర్ కు గాను దర్శకుడిని అభినందించారు. ఈ సినిమా గురించి వంశీ మాట్లాడుతూ “ఈ సినిమాలో చూపించిన భయంకరమైన విసువల్స్ చిత్రీకరించడం చాలా కష్టం. ప్రవీణ్ శ్రీ బృందం ఆ షాట్స్ తీసిన విధానానికి నేను పులకించిపోయాను. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాదిస్తుందని ఆశిస్తున్నానని”అన్నారు.

ఈ సినిమాలో చైతన్య కృష్ణ, చాందిని ప్రధాన పాత్రలు పోషించారు. భోజ్ పూరి నటుడు పంకజ్ కేసరి విలన్ గా కనపడనున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూర్ లో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఇందిలో తీసిన సన్నివేశాలను తెరకెక్కించడం అంత సులువైన పనేమి కాదని చైతన్య కృష్ణ అన్నాడు. నందన్ రాజ్ సంగెతం అందించిన ఈ సినిమా మేలో విడుదల కావచ్చు.

తాజా వార్తలు