పార్లమెంట్ సభ్యులు కళాబందు డా.టి.సుబ్బరామి రెడ్డి గారు విశాఖ సముద్ర తీరాన మహా శివరాత్రి నాడు కోటి ఎనిమిది లక్షల శివలింగాలతో 27 వ మహా కుంబాభిషేకం 20వ తేది సోమవారం నాడు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఉదయం 8.00 గంటల నుండి రాత్రి 10.౦౦ గంటల వరకు పద్నాలుగు గంటల పాటు నిర్విరామంగా ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు వాసు రావు సంగీత నిర్వహణలో ప్రముఖ గాయని గాయకులూ భక్తి సంగీత విభావరి నిర్వహిస్తారు. ఆ సందర్బంగా సాయంత్రం 5.00 గంటలకు ప్రముఖ చలన చిత్ర దర్శకులు రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత కళాతపస్వి పద్మశ్రీ డా.కే.విశ్వనాధ్ గారికి “విశ్వ విఖ్యాత దర్శక సార్వబౌమ” బిరుదు ప్రదానం జరుగుతుంది. ఆ సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర రావాణ శాఖ మాత్యులు మరియు కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ బొత్స సత్యనారాయణ పాల్గొంటారు. పార్లమెంట్ సభ్యులు కళాబందు డా.టి.సుబ్బరామి రెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు. గౌరవ అతిధులుగా పర్యాటక శాఖ మాత్యులు శ్రీ వట్టి వసంత కుమార్, గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పి,బాలరాజు, రాష్ట్ర మౌలిక సదుపాయాలు మరియు రేవుల శాఖ మాత్యులు శ్రీ ఘంటా శ్రీనివాస రావు, రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ శ్రీ R.V. రమణ మూర్తి మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్ శ్రీ ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొంటారు. విశిష్ట అతిధిగా డా.డి.రామానాయుడు, ప్రత్యేక అతిధులుగా పద్మశ్రీ డా.కె.బ్రహ్మానందం, సిని నటీమణులు భానుప్రియ, మంజు భార్గవి, తులసి పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని టి.సుబ్బరామి రెడ్డి లలితకళా పరిషత్ నిర్వహిస్తుంది.
కళాతపస్వి పద్మశ్రీ డా.కే.విశ్వనాధ్ గారికి “విశ్వ విఖ్యాత దర్శక సార్వబౌమ బిరుదు ప్రదానం”
కళాతపస్వి పద్మశ్రీ డా.కే.విశ్వనాధ్ గారికి “విశ్వ విఖ్యాత దర్శక సార్వబౌమ బిరుదు ప్రదానం”
Published on Feb 16, 2012 11:31 AM IST
సంబంధిత సమాచారం
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
- పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఘాటి ‘దస్సోర’ సాంగ్
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- టీమ్ ఇండియా వైస్ కెప్టెన్సీ మార్పుతో సంజు శాంసన్‌కు కొత్త పోటీ – గిల్, పంత్, అక్షర్ మధ్య ఆసక్తికర సమీకరణాలు
- గుండెల్ని హత్తుకునేలా ‘కన్యాకుమారి’ ట్రైలర్
- ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ ప్రకటన.. ఎప్పుడంటే..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 8 వసంతాలు తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?
- నైజాంలో వర్కింగ్ డేకి కూలీ, వార్ 2 ఇక్కట్లు!
- పోల్ : ఒక సినిమాలో జంటగా, మరో చిత్రంలో తోబుట్టువులుగా — ఆ నటీనటులను ఊహించండి!
- సర్ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హరిహర వీరమల్లు’
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ‘మదరాసి’ ఫస్ట్ హీరో అతను అంటున్న మురుగదాస్!
- అఫీషియల్ : రూ.300 కోట్లు దాటిన ‘వార్ 2’ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్..!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?