13 సార్లు నేషనల్ బాడ్ మింటన్ చాంపియన్ షిప్ గెలుగుకున్న ఫేమస్ ఇండియన్ బాడ్ మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా సినిమాల్లో నటించడానికి రెడీగా ఉన్నానని, అందుకు సంబంధించి కొన్ని కథలు కూడా వింటున్నానని ఇది వరకే తెలిపింది. అలాంటి ఈ భామ సినిమాతో కాకుండా ఒక స్పెషల్ సాంగ్ తో తెరపైకి రానుంది. యంగ్ హీరో నితిన్, మళయాళ కుట్టి నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న సినిమా ‘గుండె జారి గల్లంతయ్యిందే’. ఈ సినిమాలో జ్వాలా గుత్తా ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె ఓ సోషల్ నెట్వర్కింగ్ సైటులో తెలిపారు.
విజయ్ కుమార్ కొండ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.