టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన చిత్రం ‘జూనియర్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. కొత్త హీరో కిరీటీ వెండితెరకు పరిచయమైన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ చిత్రంపై అదిరిపోయే బజ్ క్రియేట్ చేసింది. రాధాకృష్ణ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూలై 18న రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో కిరీటీ పర్ఫార్మెన్స్, డ్యాన్స్‌కు ప్రత్యేకంగా అభినందనలు దక్కాయి. ఇక ఈ సినిమాతో జెనీలియా ఓ పవర్‌ఫుల్ పాత్ర చేసి టాలీవుడ్ కమ్ బ్యాక్ ఇచ్చింది. అయితే, ఈ సినిమా తొలి వీకెడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్‌తో ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రం కోసం 24 గంటల్లో బుక్ మై షోలో ఏకంగా 40 వేలకు పైగా టికెట్లు బుక్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు. దీన్నిబట్టి ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ అర్థం చేసుకోవచ్చు.
జూనియర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్నట్లు సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా టోటల్ రన్‌లో ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.