‘కాంతార చాప్టర్ 1’ నుంచి సాలిడ్ అప్డేట్.. మేకింగ్ వీడియోతో షూటింగ్ ముగింపు..!

‘కాంతార చాప్టర్ 1’ నుంచి సాలిడ్ అప్డేట్.. మేకింగ్ వీడియోతో షూటింగ్ ముగింపు..!

Published on Jul 21, 2025 11:09 AM IST

Kantara-Chapter-1

కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తనదైన మార్క్ వేసుకున్నాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా మేకర్స్ రూపొందించగా ఇందులోని వైవిధ్యమైన కంటెంట్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఏకంగా ఈ సినిమా జాతీయ అవార్డును సైతం గెలుచుకుందంటే ఈ చిత్రం జనాల్లోకి ఎంతలా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార ఎ లెజెండ్ చాప్టర్ 1’ను తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగిసినట్లు మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను వారు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కాంతార ప్రపంచం ఎలా ఉంటుందో రిషబ్ శెట్టి వివరించిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టం మనకు తెలిపారు.

కాంతార అంటే సినిమా కాదని.. తమ చరిత్ర అని రిషబ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మేకింగ్ వీడియోలో కాంతార చిత్రానికి సంబంధించిన విజువల్స్, భారీ మేకింగ్, క్యాస్టింగ్ మనకు చూపెట్టారు. మొత్తానికి మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు కాంతార సిద్ధమవుతున్నట్లు ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు