ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ‘హరిహర వీరమల్లు’ ఏకఛత్రాధిపత్యం

ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ‘హరిహర వీరమల్లు’ ఏకఛత్రాధిపత్యం

Published on Jul 21, 2025 1:08 PM IST

Hari Hara Veera Mallu

బాక్సాఫీస్ దగ్గర ‘హరిహర వీరమల్లు’ సినిమా జూలై 24న రిలీజ్ అవుతుండటంతో అందరి చూపులు ఆ సినిమాపైనే ఉన్నాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ హిస్టారికల్ ఎపిక్ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంటుందా అనే టాక్ చర్చనీయాంశంగా మారింది.

కాగా, హరిహర వీరమల్లు సినిమా కోసం మిగతా సినిమాలు తమ రిలీజ్ డేట్స్ వాయిదా వేసుకున్నాయి. దీంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పోటీ లేకుండా పోయింది. పెద్ద సినిమాలు లేకపోవడం.. చిన్న సినిమాలు కూడా వెనకడుగు వేయడంతో వీరమల్లు సోలోగా బరిలోకి దిగుతున్నాడు. ఇక పవన్ తుఫాను కోసం దాదాపు 90 శాతం థియేటర్లు సిద్ధమవుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ లెక్కన హరిహర వీరమల్లు చిత్రం ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ఏకఛత్రాధిపత్యం చూపించడం ఖాయమని పలువురు అంటున్నారు. అయితే, ఈ సినిమా ఎలాంటి వసూళ్లతో విధ్వంసాన్ని సృష్టిస్తుంది.. అనేది ఈ చిత్ర రిజల్ట్‌పై ఆధారపడి ఉంది. నిధి అగర్వాల్, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు