స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘జులాయి’ చిత్రం ఈ రోజుటితో 50 రోజుల మైలురాయిని చేరుకుంది. ఆగష్టు 9న విడుదలైన ఈ సినిమా బన్ని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో అల్లు అర్జున్ 40 కోట్ల పైన కలెక్షన్ సంపాదించిన హీరోల జాబితాలో చేరిపోయారు.
హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు దర్శకత్వం వహించారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించారు. ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ మరియు సోనూ సూద్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ ఒక సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.
50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ గార్లకి మరియు ఈ చిత్ర టీంకి అభినందనలు తెలియజేస్తున్నాం.