‘వార్ 2’: ముగ్గురు ఏజెంట్స్ పై అద్దిరిపోయిన స్ట్రైకింగ్ పోస్టర్!

WAR2

ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు రాబోతున్న అవైటెడ్ మల్టీస్టారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది “వార్ 2” అనే చెప్పవచ్చు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలానే హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా మరో 30 రోజుల్లో థియేటర్స్ లో బ్లాస్ట్ గా నిలవనుంది. అయితే ఈ 30 రోజుల షోడౌన్ పై విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ముగ్గురు ఏజెంట్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్, అలాగే కియారా అద్వానీలపై డిజైన్ చేసిన ఈ పోస్టర్ మంచి ఎనర్జిటిక్ గా హైప్ పెంచేలా ఉందని చెప్పాలి. హృతిక్ రోషన్ కటానాతో ఎన్టీఆర్ నకుల్ డస్టర్ లతో మంచి డైనమిక్ గా కనిపిస్తుండగా వీరితో పాటుగా యాక్షన్ లో కియారా కూడా కనిపిస్తుంది.

అంతే కాకుండా ఇదే పోస్టర్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇద్దరు హీరోలు బోట్లలో ఒకరికొకరు ఎదురెదురుగా గన్స్ గురి పెట్టుకోవడం అలాగే మెయిన్ పోజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒకరి వెనుక వారి యాక్షన్ ఎపిసోడ్స్ కనిపిస్తున్నాయి. ఇలా మొత్తానికి మాత్రం ఈ స్పెషల్ పోస్టర్ అద్దిరిపోయిందని చెప్పొచ్చు.

Exit mobile version