ఫోటో మూమెంట్: వింబుల్డన్ 2025 ఫైనల్స్ లో తన భార్యతో పుష్పరాజ్ క్రియేటర్

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప 2 చిత్రంతో పాన్ ఇండియా దర్శకునిగా మారిపోయిన దర్శకుడు సుకుమార్ లేటెస్ట్ గా ప్రముఖ వింబుల్డన్ 2025 టెన్నిస్ ఫైనల్స్ లో సందడి చేశారు. లండన్ వేదికగా జరుగుతున్న ఈ ప్రముఖ టెన్నిస్ టోర్నమెంట్ చూసేందుకు దర్శకుడు సుకుమార్ అలాగే తన భార్య తబిత సుకుమార్ బండ్రెడ్డిలు వెళ్లారు.

మరి అక్కడ ఇద్దరు దిగిన కొన్ని పిక్స్ బ్యూటిఫుల్ మూమెంట్స్ గా మారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో ఇవి చూసిన ఫ్యాన్స్ ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే టోర్నమెంట్ కి సంబంధించి గత కొన్ని వారాల కితమే అఫీషియల్ హ్యాండిల్ వారు పుష్ప 2 లో అల్లు అర్జున్ స్టిల్ ని జొకోవిచ్ పై డిజైన్ చేసి వదిలిన సంగతి తెలిసిందే. అలా పుష్ప మేనియా గ్లోబల్ లెవెల్ కి చేరుకోగా ఇపుడు ఆ సినిమా ఇంకా పుష్పరాజ్ క్రియేటర్ అండ్ ఫ్యామిలీ అదే టోర్నమెంట్ లో సందడి చేయడం అనేది విశేషం.

Exit mobile version