నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకుపోతున్న ఈ క్రేజీ బ్యూటీ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ చిత్రం ఎలాంటి కథతో రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ‘నదివే’ అంటూ ఓ రొమాంటిక్ మెలోడీ వీడియో సాంగ్‌ను వదిలారు. ఈ పాటను హేషమ్ తనదైన మార్క్ మెలోడీ ట్యూన్స్‌తో కంపోజ్ చేసి పాడిన తీరు అద్భుతంగా ఉంది. ఇక ఈ పాటలో రష్మిక మందన్నతో పాటు దీక్షిత్ శెట్టి చక్కటి డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు.
ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ సింగిల్ సాంగ్‌తో మంచి ఇంప్రెషన్ అందుకున్న ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి