ఓటిటి డేట్ లాక్ చేసుకున్న నితిన్ ‘తమ్ముడు’?

Thammudu

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా వర్ష బొల్లమ్మ అలాగే సప్తమి గౌడలు ఫీమేల్ లీడ్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “తమ్ముడు”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ తమ్ముడు టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా విఫలం అయ్యి ఈ కొంతలోనే ఓటిటి విడుదలకి సిద్ధమైనట్టుగా వినిపిస్తుంది.

సీనియర్ నటి లయ రీఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఈ జూలై 4న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది కానీ అంచనాలు అందుకోలేదు. దీనితో నెక్స్ట్ ఓటిటి రిలీజ్ కే రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇందులో ఈ ఆగస్ట్ 1 నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది ని లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇది అనధికారికమే కానీ దాదాపు ఇదే డేట్ లో రావచ్చట. ఇక ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా దిల్ రాజు – శిరీష్ – లక్ష్మణ్ లు నిర్మాణం వహించారు.

Exit mobile version