‘వార్ 2’కి గట్టిగా వర్కవుతున్న తారక్ ఫ్యాక్టర్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి మన తెలుగు స్టేట్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా మాత్రమే కాకుండా తాను ప్రధాన పాత్రల్లో ఒకటిగా నటించిన బాలీవుడ్ సినిమా పట్ల కూడా ఇప్పుడు భారీ క్రేజ్ ఏర్పడింది. ఇలా ఎన్టీఆర్ చేసిన లేటెస్ట్ సినిమానే “వార్ 2”.

దర్శకుడు అయాన్ ముఖర్జీ కలయికలో హృతిక్ రోషన్ తో చేసిన ఈ భారీ యాక్షన్ డ్రామా పట్ల మంచి హైప్ నెలకొంది. అయితే ఇందులో ఎక్కువ శాతం ఎన్టీఆర్ కి కూడా చెల్లుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సౌత్ సహా ఓవర్సీస్ మార్కెట్ లో ఎన్టీఆర్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ కనిపిస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాలు సహా నార్త్ అమెరికా ఇంకా ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో వార్ 2 కి భారీ ఓపెనింగ్స్ దక్కే సూచనలు, ఇప్పుడు నుంచే సాలిడ్ బజ్ జెనరేట్ అవుతుంది అంటే అందులో ఎన్టీఆర్ ప్రభావమే చాలా ఎక్కువ ఉందని చెప్పవచ్చు. ఇలా మొత్తానికి మాత్రం వార్ 2 కి ఎన్టీఆర్ బ్రాండ్ గట్టిగా పని చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

Exit mobile version