చెన్నైలో ప్రారంభమైన ‘జెండా పై కపిరాజు’ కొత్త షెడ్యూల్

nani_janda_pai_kapiraju

నాని, అమల పాల్ లు జంటగా నటిస్తున్న ‘జెండా పై కపిరాజు’ ఒక సోషల్ డ్రామా గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సముతిరకని డైరెక్టర్. ‘జెండా పై కపిరాజు’ సినిమా ఈ మద్యనే కేరళ, గోవా, హైదరాబాద్ లలో షూటింగ్ ను జరుపుకుంది. చివరిగా ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరిగింది. నిన్నరాత్రి ముంబై యష్ రాజ్ స్టూడియో ను సందర్శించిన నాని తన సినిమా ‘జెండా పై కపిరాజు’ చెన్నై లో జరగనుంది అని అన్నారు. ‘ఇద్దరమ్మాయిలతో ‘ సినిమాలో బిజీ గా వున్నా అమల పాల్ కొద్ద్దిరోజుల్లో తమ టీం తో కలుస్తుంది అని అన్నాడు. ఈ సినిమాని వాస్తవ కథని ఆధారంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమా “ముందు నువ్వు మారి తరువాత ప్రపంచాన్ని మార్చు” అన్న దానిపై తెరకెక్కిస్తున్నారు. జి.వి. ప్రకాష్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 1 న విడుదలయ్యే అవకాశం ఉంది.

Exit mobile version