మొదలైన జెండా పై కపిరాజు కొత్త షెడ్యూల్

మొదలైన జెండా పై కపిరాజు కొత్త షెడ్యూల్

Published on Jan 1, 2013 6:15 PM IST

Jenda-Pai-Kapiraju
యంగ్ హీరో నాని, అమలా పాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘జెండా పై కపిరాజు’. సముద్ర ఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మనం మారితే మనతోపాటు సొసైటీ కూడా మారుతుందనే సోషల్ థీంతో తెరకెక్కుతోంది. ఇటీవలే చలకుడి, గోవా ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. ఈ షెడ్యూల్లో నాని – అమలా పాల్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తనలో ఉండే మంచి – చెడుతో సతమతమయ్యే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలో నాని కనిపించనున్నాడు.

జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ‘ప్రేమ ఖైది’, ‘గజరాజు’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన సుకుమార్ సినిమాటోగ్రాఫర్. కె.ఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇదే సంవత్సరంలో ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

తాజా వార్తలు