కాళిచరణ్ కి వాయిస్ ఇవ్వనున్న ఫ్యామిలీ హీరో

కాళిచరణ్ కి వాయిస్ ఇవ్వనున్న ఫ్యామిలీ హీరో

Published on May 26, 2013 7:00 PM IST

Jagapathi-Babu
శ్రీ పవన్ దర్శకత్వంలో రానున్న’కాళిచరణ్’ సినిమాకి వాయిస్ ఓవర్ రూపంలో మరోకొత్త స్పెషాలిటీని సంతరించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఫ్యామిలీ హీరో జగపతి బాబు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు. అతని వాయిస్ సినిమా మొదలయ్యే టప్పుడు కథని మనకి పరిచయం చేసేటప్పుడు వస్తుంది. చైతన్య కృష్ణ, చాందిని హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ద్వారా బొజ్ పురి నటుడు పంకజ్ కేసరి విలన్ గా పరిచయమవుతున్నాడు. కవిత శ్రీనివాసన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

ఈ సినిమాని ఎర్ర సత్యం జీవితం ఆధారంగా తీసారు. ఈ సినిమా 1980 బ్యాక్ డ్రాప్ లో మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు ప్రాంతంలో సాగుతుంది. ‘కాళిచరణ్’ ఒక రివెంజ్ స్టొరీ. అలాగే ఇందులో చైతన్య కృష్ణ – చాందిని మధ్య ఓ రొమాంటిక్ ట్రాక్ ఉంటుంది. నందన్ రాజ్ సంగీతం అందించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే సినిమా విడుదల కానుంది.

తాజా వార్తలు