“జబర్దస్త్ చేస్తున్నంతసేపూ నాకు కాలమే తెలియలేదు” -సిద్ధార్ద్

“జబర్దస్త్ చేస్తున్నంతసేపూ నాకు కాలమే తెలియలేదు” -సిద్ధార్ద్

Published on Feb 18, 2013 10:38 PM IST

Siddharth
సిద్ధార్ద్ తన రాబోయే సినిమా ‘జబర్దస్త్’ పై చాలా నమ్మకంగా ఉన్నాడు. అతను మొదటిసారిగా ఈ సినిమా ద్వారా మాస్ కామెడీ రోల్ చెయ్యనున్నాడు.ఇప్పటివరకూ తను చేసిన సినిమాలలో తనకు బాగా టైం పాస్ అయిన సినిమా ఇదేనట.”ఫిబ్రవరి 22న నందిని రెడ్డి ‘జబర్దస్త్’ విడుదల అవుతుంది. నిజంగా ఇది చాలా సరదాగా, వినోదభరితంగా ఉంటుంది. నాకు బాగా టైం పాస్ అయిన తెలుగు సినిమా. థాంక్యూ నందు. సమంత, థమన్ మరియు సినిమాటోగ్రాఫర్స్ మహేష్ – సంజయ్ జబర్దస్త్ ని మరింత ప్రత్యేకంగా మార్చారు.అందరికీ ధన్యవాదాలు! శ్రీహరి గారు, నిత్యామీనన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. సినిమాలో శ్రీహరి గారి భాగం నిజంగా అద్బుతం. థాంక్యూ సర్ .. ” అని సినిమా గురించి ట్వీట్ చేసాడు.

కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధార్థ్ ‘బావ’ అనే చిత్రంలో ఆకతాయి పాత్ర పోషించాడు. కాకపోతే అది బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ఇప్పటివరకూ రొమాంటిక్ మూవీస్ లో నటించిన సిద్దార్ధ్ ఇప్పుడు ‘జబర్దస్త్’ వంటి చిత్రంతో తన పంథా మారుస్తున్నాడు. డేవిడ్ ధావన్ ‘చష్మే బద్ధూర్’ మరియు సుందర్.సి దర్శకత్వంలో ఒక కామెడీ సినిమా త్వరలో మన ముందుకు రానున్నాయి.

తాజా వార్తలు