6 – 60 వరకూ అందరూ చూడదగిన జబర్దస్త్

Jabardasth

సిద్దార్థ్, సమంత జంటగా నటించిన ‘జబర్దస్త్’ సినిమా ఈ శుక్రవారం విడుదలకు సిద్దమవుతోంది. ‘అలా మొదలైంది’ ఫేం నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎలాంటి వల్గారిటీ ఉండదని క్లీన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆమె అన్నారు. ” నా వల్గారిటీలేని క్లీన్ కామెడీ ఉంటుంది. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి కానీ అవి కూడా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటాయి. ఈ సినిమా 6 – 60 సంవత్సరాల మధ్య ఉన్న అందరూ చూడదగ్గ సినిమా అని’ నందిని రెడ్డి అన్నారు.

ఈ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తాగుబోతు రమేష్ మొదలైన కమెడియన్స్ తో కలిసి సిద్దార్థ్, సమంత కూడా తమ కామెడీతో నవ్వించనున్నారు. ఎస్.ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ వారు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

Exit mobile version