జెడి చక్రవర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఎమ్ ఎమ్ ఓ ఎఫ్’. నేడు ఈ చిత్ర ట్రైలర్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంచ్ చేయడం జరిగింది. విశేషంగా రెండు నిమిషాలకు పైగా గల ట్రైలర్ లో ఎమ్ ఎమ్ ఓ ఎఫ్ సినిమా మొత్తం చూపించేశారు. ట్రైలర్ కూడా సరికొత్తగా జెడి చక్రవర్తి వాయిస్ ఓవర్ తో సాగింది. అనుకోకుండా ఓ ప్రమాదంలో చిక్కుకున్న చక్రవర్తి.. ఆ ప్రమాదం నుండి తప్పించుకొనే క్రమంలో తనకు మించిన డేంజర్ లో చిక్కుకున్న చెల్లిని చూస్తాడు. చెల్లి కోసం తప్పించుకోవడం వదిలేసి ప్రమాదం పై తిరగబడతాడు. ఇదే ఈ మూవీ స్టోరీ..
ఐతే ఆ ప్రమాదం ఏమిటీ..? అతను ఆ సమస్యలో ఎలా చిక్కుకున్నాడు ? ఉండకూడని ప్రదేశంలో అతని చెల్లి ఏమి చేస్తుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రానికి యెన్ ఎస్ సీ దర్శకత్వం వహిస్తుండగా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది.
ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి