విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ఇష్క్

విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ఇష్క్

Published on Apr 13, 2012 10:05 AM IST


నితిన్ మరియు నిత్యా మీనన్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇష్క్ ఈ రోజుతో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయవంతమైంది. ఇష్క్ రెగ్యులర్ మాస్ సినిమా కాకపోయినప్పటికీ విమర్శకులతో పాటుగా ప్రేక్షకులు ఆదరణ నోచుకుంది. నితిన్, నిత్యా మీనన్ నటన, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ సంగీతం అన్ని చిత్ర విజయానికి దోహద పడ్డాయి. శ్రేష్ట్ మూవీస్ బ్యానర పై విక్రమ్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో నితిన్ మరో సినిమాకి రెడీ ఐపోయాడు. ఈ రోజుల్లో సినేమ్తో విజయాన్ని అందుకున్న మారుతీ డైరెక్షన్లో తన తరువాతి సినిమా చేయనున్నాడు.

తాజా వార్తలు