దర్శకుడికి ఛాలెంజ్ గా మారిన ప్రభాస్ టైటిల్..!

దర్శకుడికి ఛాలెంజ్ గా మారిన ప్రభాస్ టైటిల్..!

Published on Apr 18, 2020 9:06 AM IST

ప్రభాస్ మూడు భారీ పాన్ ఇండియా చిత్రాల తరువాత ఓ పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తున్నారు. ప్రభాస్ నుండి ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ మిస్ కాకుండానే బలమైన ఎమోషన్స్ తో దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నారట. ఐతే ఈ చిత్ర టైటిల్ విషయంలో మూవీ టీం కొంచెం కన్ప్యూ జన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న భారీ చిత్రం. కాబట్టి అన్ని పరిశ్రమలకు సెట్ అయ్యే విధంగా క్యాచీ టైటిల్ పెట్టాలి. నిజానికి ఈ చిత్రానికి టైటిల్ గా జాను అనుకున్నారు. ఇదే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కించడం జరిగింది.

ఐతే దిల్ రాజు కోరిక మేరకు నిర్మాతలు జాను టైటిల్ ఆయనకు ఇచ్చేశారు. ఆ టైటిల్ 96 తెలుగు రీమేక్ కి ఆయన వాడుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ పీరియాడిక్ సెన్సిబుల్ లవ్ స్టోరీ కి ఎలాంటి టైటిల్ పెట్టాలనే విషయంలో చిత్ర యూనిట్ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట. అటు పాత వాసన తగలకుండా, కథకు సరిపోయేలా పాన్ ఇండియా లెవెల్ టైటిల్ సెర్చింగ్ లో టీమ్ బిజీ అట. అందుకే ప్రభాస్ మూవీ టైటిల్ లేటు అవుతుందని వినికిడి. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా, పూజ హెగ్డే నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు