‘ఉస్తాద్’ నుంచి బిగ్ అప్ డేట్ రానుంది ?

‘ఉస్తాద్’ నుంచి బిగ్ అప్ డేట్ రానుంది ?

Published on Oct 5, 2025 8:00 AM IST

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”. ఓజీ తర్వాత, పవన్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పై ఉన్నాయి, ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. అదే విషయాన్ని ఈ నెలలో ప్రకటించబోతున్నారు.

ఈ సినిమా షూటింగ్ ను తాజాగా పవన్ కల్యాణ్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల మరియు రాశి ఖన్నా నటించారు. ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ తన లుక్ ను కూడా మార్చారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే, ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

తాజా వార్తలు