‘జైలర్ 2’ కోసం రజినీకాంత్ కి భారీ రెమ్యునరేషన్?

‘జైలర్ 2’ కోసం రజినీకాంత్ కి భారీ రెమ్యునరేషన్?

Published on May 8, 2025 12:00 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇపుడు చేస్తున్న అవైటెడ్ చిత్రం “కూలీ” పట్ల ఏ రేంజ్ హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఈ సినిమా తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో భారీ సీక్వెల్ జైలర్ పార్ట్ 2 ని రజినీకాంత్ చేయనున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ ఇపుడు శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా ఈ చిత్రానికి రజినీకాంత్ అందుకుంటున్న భారీ రెమ్యునరేషన్ పై టాక్ వినిపిస్తుంది.

దీని ప్రకారం తలైవర్ జైలర్ 2 కోసం ఏకంగా 260 కోట్లు తీసుకుంటున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో కోలీవుడ్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా కూడా రజినీకాంత్ రెమ్యునరేషన్ ఓక్ రికార్డు మొత్తంలో ఒకటని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ సహా మరింతమంది స్టార్స్ కనిపించనున్నారు. అలాగే వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు