ప్రభాస్ సినిమాకు అక్షయ్ సినిమాకు లింక్ ఉందా?

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ “ఆదిపురుష్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏమిటి అన్నది పాన్ ఇండియన్ వైడ్ గా ప్రభాస్ ఫాలోవర్స్ కు ఒక క్లారిటీ వచ్చింది.

ఇప్పుడు ఇదిలా ఉండగా బాలీవుడ్ లో స్టార్ హీరో అయినటువంటి అక్షయ్ కుమార్ లేటెస్ట్ గా ఈరోజు దీపావళి సందర్భంగా తన కొత్త సినిమా పోస్టర్ ను లాంచ్ చేసారు. అభిషేక్ శర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గాను “రామ సేతు” అనే టైటిల్ ను పెట్టి ఆసక్తికర పోస్టర్ ను డిజైన్ చేసారు. ఇందులో మొదట అక్షయ్ కుమార్ కనిపిస్తూ బ్యాక్ గ్రౌండ్ లో శ్రీరాముని విజువల్ ఉంది.

దీనితో ప్రభాస్ చేస్తున్న “ఆదిపురుష్” పోస్టర్ కూడా ఒకేలా ఉందని టాక్ మొదలయ్యింది. దీనితో ఆ సినిమాకు దీనికి లింకప్ చేస్తూ కామెంట్స్ పడుతున్నాయి. అలాగే ప్రభాస్ సినిమాకు పోటీగా ఈ సినిమాను చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. అయితే కామన్ గా రామాయణం ఈ రెండు చిత్రాలకు లింకప్ అయ్యి ఉన్నా అక్షయ్ టేకప్ చేసిన సినిమాలో చూస్తే వారు ఇంకేదో చూపించే ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది. వారి పోస్టర్ లో రామాయణం నిజమా కల్పితమా అన్నట్టుగా ట్యాగ్ ను హైలైట్ చేస్తున్నారు. మరి ఈ అంశంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version