మహేష్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నారా.?

మహేష్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నారా.?

Published on Feb 4, 2021 12:00 PM IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మాస్ ఫ్లిక్ చిత్రం “సర్కారు వారి పాట”. తన హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ జైత్ర యాత్రను ఈ చిత్రంతో కొనసాగించాలని చూస్తున్న మహేష్ ఈ సినిమాను కూడా అంతే స్థాయిలో పర్ఫెక్ట్ ప్లానింగ్ లో చేస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇప్పుడు దుబాయ్ లో ఒక కీలక షెడ్యూల్ తో బిజీగా ఉంది. అయితే ఇందులో కేవలం కీర్తి మరియు మహేష్ మధ్య రొమాంటిక్ ట్రాక్స్ మాత్రమే కాకుండా అదిరే యాక్షన్ సీక్వెన్స్ కూడా తీస్తున్నారని టాక్ వచ్చింది. మరి అందుకు తగ్గట్టు గానే లేటెస్ట్ గా బయటకొచ్చిన ఆన్ లొకేషన్ స్టిల్ చూస్తే అనిపిస్తుంది.

ఎర్రటి ఎండలో మహేష్ వెనుక దర్శకుడు ఇతర చిత్ర యూనిట్ కనిపిస్తున్నారు. మరి అలాగే దానితో పాటుగా బ్యాక్గ్రౌండ్ లో కొన్ని కార్లు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇవన్నీ చూస్తుంటే ఒక అదిరే కార్ ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఏమో అనిపిస్తుంది. మరి అదా కాదా అన్నది తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ప్రస్తుతానికి అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు