అవైటెడ్ “ఖైదీ 2” అప్పటికి షిఫ్ట్ అయ్యిందా?

అవైటెడ్ “ఖైదీ 2” అప్పటికి షిఫ్ట్ అయ్యిందా?

Published on Mar 15, 2025 3:00 AM IST

కోలీవుడ్ సహా తెలుగు సినిమాలో కూడా మంచి ఆదరణ ఉన్న టాలెంటెడ్ హీరోస్ లో కార్తీ కూడా ఒకరు. మరి కార్తీ హీరోగా ఇపుడు తన సాలిడ్ సీక్వెల్ సర్దార్ 2 చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని మించి మరో సీక్వెల్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా “ఖైదీ 2” అని చెప్పాలి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేసిన ఈ సినిమాతో ఓ రకంగా కార్తీ భారీ కంబ్యాక్ ఇచ్చాడు.

అక్కడ నుంచి ఈ సినిమా సీక్వెల్ పై హైప్ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ అసలుకి గత ఏడాది చివరలోనే స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ మధ్యలో రజినీకాంత్ కూలీ సినిమా రావడంతో ఖైదీ 2 ఆలస్యం అయ్యింది. ఇక ఈ ఏడాదిలో అయినా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఇపుడు ఈ సినిమా ఈ ఏడాదిలో కూడా స్టార్ట్ కాదు అని తెలుస్తుంది. ఇపుడు ఏకంగా వచ్చే ఏడాది ఏప్రిల్ కి షిఫ్ట్ అయ్యినట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి చూడాలి దీనిపై అధికారిక క్లారిటీ ఏమన్నా వస్తుంది అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు