మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ తర్వాత ఇప్పుడు ఆయన ‘కాంత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టీజర్, ట్రైలర్ చూసి ఇది కూడా మరో క్లాసిక్‌గా నిలుస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి.
దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న కాంత ఒక బయోపిక్ చిత్రమని తెలుస్తోంది. తమిళ సినీ లెజెండ్ ఎం.కే.త్యాగరాజన్ జీవితం ఆధారంగా ఈ కథ నడుస్తుందని తమిళ వర్గాలు చెబుతున్నాయి.
స్టేజ్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన త్యాగరాజన్, ‘హరిదాస్’తో స్టార్‌గా ఎదిగాడు. కానీ 1944లో హత్య కేసుతో ఆయన జీవితం మారిపోయింది. నిర్దోషిగా బయటపడ్డా, తిరిగి నిలబడలేకపోయాడు. అదే కథను ‘కాంత’లో దుల్కర్ తెరపై చూపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్ అవుతతుండగా భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటిస్తోంది.
