‘టైసన్ నాయుడు’పై బెల్లంకొండ శ్రీనివాస్ అప్డేట్.. ఏమిటంటే..?

‘టైసన్ నాయుడు’పై బెల్లంకొండ శ్రీనివాస్ అప్డేట్.. ఏమిటంటే..?

Published on Sep 3, 2025 11:00 PM IST

Bellamkonda-Sreenivas

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్‌గా భైరవం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఆ సినిమా మల్టీస్టారర్ మూవీగా వచ్చినా.. అది అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు ‘కిష్కింధపురి’ అనే హార్రర్ జోనర్ చిత్రంతో ఈ హీరో మనముందుకు రాబోతున్నాడు.

ఈ చిత్ర ట్రైలర్‌ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాను నటిస్తున్న టైసన్ నాయుడు మూవీ గురించి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. టైసన్ నాయుడు చిత్రం ఎప్పుడో పూర్తయిందని.. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా అవుతూ వచ్చిందని.. ఇక ఈ డిసెంబర్‌లో టైసన్ నాయుడు చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ఆయన తెలిపారు.

దీంతో టైసన్ నాయుడు చిత్రం గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుండగా, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌పై హీరో స్వయంగా అప్డేట్ ఇవ్వడంతో అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

తాజా వార్తలు