ఆంధ్ర కింగ్ తాలూకా.. బీట్ రెడీ సింగర్ కూడా రెడీ..!

ఆంధ్ర కింగ్ తాలూకా.. బీట్ రెడీ సింగర్ కూడా రెడీ..!

Published on Sep 3, 2025 6:06 PM IST

Andhra-King-Taluka

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ అవగా, వాటికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ సాంగ్ అనౌన్స్‌మెంట్‌ను సెప్టెంబర్ 4న ఉదయం 11.07 గంటలకు అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాకు వివేక్-మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా ఈ చిత్రాన్ని నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు