పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘ఓజి’ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో పవన్ కళ్యాణ్ తనదైన వింటేజ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ ఈ సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ చేసింది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనుండటంతో ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఓవర్సీస్ మార్కెట్‌లో రికార్డులు ఓజి కి దాసోహం అంటున్నాయి.
నార్త్ అమెరికాలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ వేయనున్నారు. ఇప్పటికే ప్రీ-సేల్స్ టికెట్ బుకింగ్ ఓపెన్ కాగా, ఈ సినిమా అప్పుడే ప్రీ-సేల్స్‌తో ఏకంగా 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరింది. ఇంకా 20 రోజుల సమయం ఉండగానే ఈ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తూ ఓజి సరికొత్త సెన్సేషన్ సెట్ చేస్తున్నాడని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.