యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ బేస్డ్ సినిమా సిటీమార్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన గోపీచంద్ ఈ సినిమాలో కామెడీ కూడా చేస్తున్నాడట. వెన్నెల కిశోర్ – గోపీచంద్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఫూల్ గా నవ్విస్తాయని తెలుస్తోంది. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఈ కామెడీ సీక్వెన్సెస్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయట. అన్నట్లు ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రా ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా చేస్తోంది.
కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుంది. కాగా ‘యు టర్న్’లాంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ కొట్టాలని ఆశిద్దాం.