త్రివిక్రమ్ డిమాండ్ కి కారణం అదే !

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాల్లో.. హీరోల క్యారెక్టరైజేషన్, టైమింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటూనే.. అటు కమర్షియల్ గానూ ఆకట్టుకుంటాయి. ఓ వైపు క్లాస్ ఆడియన్స్ ను మెప్పిస్తూనే.. మరో వైపు మాస్ ప్రేక్షకుల పల్స్ పట్టుకుంటాడు త్రివిక్రమ్. అందుకే ఈ మాటల మాంత్రికుడు డైరెక్షన్ లో పని చేయాలని, చిన్న హీరో నుండి పెద్ద హీరోలు వరకూ ఆశ పడుతుంటారు. అందుకే త్రివిక్రమ్ కు ఉన్న డిమాండ్ ఓ రేంజ్ లో ఉంది. అందుకే ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ కోసం మహేష్ బాబునే కాకుండా రామ్ చరణ్ కూడా సినిమా చేద్దామని అడిగినట్లు తెలుస్తోంది. అలాగే అక్కినేని నాగార్జున కూడా ఎప్పటినుండో అఖిల్ తో ఒక సినిమా చేసి పెట్టు అని త్రివిక్రమ్ ను అడుగుతున్నాడు. ఇప్పటికే తరువాత సినిమాని మహేష్ బాబు తో ఫిక్స్ చేసిన త్రివిక్రమ్… ఆ తరువాత సినిమాని అఖిల్ తో చేస్తాడాట. మరోపక్క త్రివిక్రమ్ తో మరో సినిమా చేయడానికి బన్నీ అప్పుడే త్రివిక్రమ్ కి ప్రపోజల్ పెట్టాడట. హీరోలకు వాళ్ళ ఫ్యాన్స్ కు కావాల్సిన ఎలిమెంట్స్ ను సినిమాలో చూపిస్తూనే.. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా సినిమాని చేరువ చేస్తాడు కాబట్టే.. త్రివిక్రమ్ కు ఇంత డిమాండ్ ఉంది.

Exit mobile version