అల్లు అర్జున్- సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీ పుష్ప ఫస్ట్ లుక్ జనాలకు బాగానే కనెక్ట్ అయ్యింది. సుకుమార్ మరో ప్రయోగానికి తెరలేపాడని ఇట్టే అర్ధమైపోతుంది. రాయలసీమ చిత్తూరు యాస, భాషతో పాటు బన్నీ ఊరమాసు మొరటు కుర్రాడిగా ఇరగదీస్తాడనిపిస్తుంది. ఐతే సుకుమార్-చరణ్ ల బ్లాక్ బస్టర్ రంగస్థలం వాసనలు కొంచెం జ్ఞప్తికి వస్తున్నాయి. ఆలాగే బన్నీ డ్రెస్సింగ్ స్టైల్, గెటప్ కూడా రంగస్థలంలో రామ్ చరణ్ ని పోలివుంది. దీనితో ఇది కూడా పీరియాడిక్ రేవేంజ్ డ్రామా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
బన్నీ లుక్ బయటికి వచ్చాక హీరోయిన్ రష్మిక లుక్ పై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగిపోయింది. మరి ఆమె పుష్ప రాజ్ లవరైన పల్లెటూరి అమ్మాయిగా కనిపించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. లేదా లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ అయినా అయ్యివుండొచ్చు. ఒక వేళ రశ్మిక పల్లెటూరి పిల్లగా కనిపించాల్సి వస్తే రంగస్థలంలో రామలక్ష్మిని తలపించడం ఖాయం అంటున్నారు. బన్నీ లుక్ ని బట్టి అంచనా వేస్తే రష్మిక లుక్ రంగస్థలంలో సమంత లుక్ ని పోలివుండే అవకాశాలు ఉన్నాయి.