ఎన్టీఆర్ కోసం పాత కథలకు పదునుపెడుతున్న త్రివిక్రమ్?

ఎన్టీఆర్ కోసం పాత కథలకు పదునుపెడుతున్న త్రివిక్రమ్?

Published on Mar 7, 2020 9:23 AM IST

దర్శకుడు త్రివిక్రమ్ టేకింగ్ అండ్ డైలాగ్స్ ఆహ్లాదంగా బాగా ఆకట్టుకొనేలా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలో కొంచెం ఇతర భాషా చిత్రాలు మరియు టాలీవుడ్ పాత సినిమా వాసనలు కనిపించినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో సినిమాలో కూడా అలనాటి ఎన్టీఆర్, సావిత్రి ల ఇంటిగుట్టు సినిమా ఛాయలు చాలానే కనిపిస్తాయి. స్వార్ధంతో పిల్లలను మార్చి వేయడం అనే మెయిన్ కాన్సెప్ట్ ఆ సినిమాలోదే.

కాగా ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి కథ సిద్ధం చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత చిత్రాల వలే ఎన్టీఆర్ కోసం కూడా ఓ పాత సినిమా కథకు కొత్త హంగులు దిద్దే పనిలో త్రివిక్రమ్ ఉన్నారట. ఈ చిత్రం మరో రెండు నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. మే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుండగా, 2021 వేసవి కానుకగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు.

తాజా వార్తలు