బిగ్ బాస్.. ఎమోషనల్ గేమ్ గా సాగే పక్కా కమర్షియల్ రియాల్టీ షో. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ సీజన్-4 మొదలైంది. పైగా ఈ సారి గత సీజన్ ల కంటే కూడా ఫుల్ ఇంట్రస్టింగ్ గేమ్స్ యాడ్ చేయబోతున్నారట. అందుకే సాధ్యమైనంత వరకూ హౌస్ లో అమ్మాయిలే ఎక్కువగా ఉండేలా.. వారితో ఉండే అబ్బాయిలతో పోటీ ఉండేలా కొంత డ్రామాను కూడా యాడ్ చేశారట బిగ్ బాస్ నిర్వాహకులు.
ఏమైనా ఇలాంటి షోలు హిందీలో ఎప్పుడో వచ్చినా తెలుగులో రావడానికి చాలా ఏళ్లే పట్టింది. అయితే ఆ క్రెడిట్ ఎన్టీఆర్ కే దక్కుతుంది. సీజన్ వన్ కి హోస్ట్ గా చేసి.. షోని తెలుగు జనాల్లోకి తీసుకువెళ్ళాడు. అలాగే గత మూడు సీజన్ ల్లో వంద రోజులకు తగ్గకుండా షోలు ఎలా నడిచాయో.. ఈ దఫా కూడా వంద రోజులకు తగ్గకుండా బిగ్‌బాస్ రియాల్టీ షో కొనసాగనుంది.
ఇక నాలుగో సీజన్‌కు కూడా హోస్ట్‌గా హీరో నాగార్జున వ్యవరించబోతున్నాడు. నాగార్జున కోసం బిగ్‌బాస్ టీం ప్రత్యేక జాగ్రత్త లు తీసుకుంటుంది. ముఖ్యంగా నాగ్ కోసం ప్రత్యేక రూమ్స్ ను అండ్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోందట.