ఎన్టీఆర్ ఓ పక్క “ఆర్ఆర్ఆర్” షూటింగ్ షెడ్యూలులో బిజిగా గడుపుతూనే తీరికదొరికినప్పుడల్లా కొంత సమయాన్ని తన కుటుంబానికి కేటాయిస్తున్నారు. కాగా నేడు ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి హోళీ జరువుకున్నాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ అందరికీ హోళీ శుభాకాంక్షలు తెలిపాడు.
ఫొటోలో ఇద్దరు కొడుకులతో పాటు ఎన్టీఆర్ దంపతులను చూస్తుంటే ముచ్చటేస్తుంది. అభయ్ రామ్, భార్గవ్ రామ్ ల ఫోటోని చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ముఖ్యంగా భార్గవ్ రామ్ ప్రేక్షకులతో పాటు నెటిజన్లందర్నీ బాగా ఆకట్టుకుంటున్నాడు. చిన్న స్మైల్ తో పాటు పేస్ లో చిన్న కూల్ నెస్ తో.. కెమెరా వైపు క్యూట్ లుక్స్ తో చూస్తూ అందరీ అంటెక్షన్ ను తన వైపుకు తిప్పుకున్నాడు.
మొత్తానికి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే భార్గవ్ రామ్ ఫ్రేమ్ కి అనుగుణంగా పోజ్ ఇవ్వడంతో లిటిల్ టైగర్ లో మ్యాటర్ ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Wishing you all a very #HappyHoli pic.twitter.com/dTJ1V9iZlK
— Jr NTR (@tarak9999) March 10, 2020