రజినీ ఆ భారీ సినిమాను చేసి తీరుతారట

రజినీ ఆ భారీ సినిమాను చేసి తీరుతారట

Published on Jan 29, 2021 12:00 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈమధ్య కాలంలో తీసుకున్న నిర్ణయాలు పలు సంచలనాలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం ఆయన సినిమాలు మీద కూడ పడింది. ఆయన తాజా చిత్రం ‘అన్నాత్తే’ విడుదల కూడ దీపావళికి వెళ్ళిపోయింది. అయితే ఈలోపు సూపర్ స్టార్ ఈ సినిమా చిత్రీకరణను ముగించి కొత్త సినిమాను ప్రారంభిస్తారని తెలుస్తోంది. రజినీ చేయబోయే తర్వాతి సినిమాల మీద పూర్తి క్లారిటీ అయితే రాలేదు కానీ ఆయన ఫ్యూచర్ సినిమాల జాబితాలో మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చి చేరింది.

అదే ‘రానా’. చాలా ఏళ్ల క్రితమే రజినీ ఈ సినిమాను చేయాలని అనుకున్నారు. కానీ బడ్జెట్ వంటి ఇతరత్రా కారణాల వలన ఆగిపోయింది. అయితే సూపర్ స్టార్ మనసులో మాత్రం ఆ స్క్రిప్ట్ అలాగే ఉండిపోయింది. ఈమధ్య దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ను పిలిపించుకుని మరొకసారి కథను విన్నారట రజినీ. విన్నాక కొన్నేళ్ల క్రితం ఎలాగైతే ఎగ్జైట్ అయ్యారో ఇప్పుడు కూడా అలాగే ఫీలయ్యారట. భవిష్యత్తులో ఈ సినిమాను తప్పకుండా చేస్తానని, ఆరోగ్య సమస్యల నుండి పూర్తిగా కోలుకుని ఫిట్ అయ్యాక మొదలుపెడదామని చెప్పారట. ఈ విషయాన్ని రవికుమార్ స్వయంగా తెలిపారు. మరి ఆ ముహూర్తం ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు