నేను మహేష్ బాబు అభిమానిని : మురుగదాస్

నేను మహేష్ బాబు అభిమానిని : మురుగదాస్

Published on Mar 13, 2014 4:17 AM IST

Murugadoss
గజిని, తుపాకి, రమణ విజయాలతో తనకంటూ ఒక క్రేజ్ ని ఏర్పరుచుకున్న తమిళ దర్శకుడు మురుగదాస్. ఆయన చేసిన ఏకైక తెలుగు సినిమా స్టాలిన్ లో చిరంజీవి హీరో. ఆయన తీసిన గజిని, స్టాలిన్ సినిమాలు ఇప్పటికే హిందీలో రీమేడ్ అయ్యాయి

ఇటీవల ఈ దర్శకుడు నిర్మించిన రాజా రాణి సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చాడు. పనిలోపనిగా నాకు మహేష్ బాబుతో పనిచెయ్యాలని వుందని చెప్పాడు “నేను మహేష్ కు పెద్ద అభిమానిని. ఆయన నటన నాకు ఇష్టం. ఆయనతో తప్పకుండా సినిమా చేస్తా” అని తెలిపాడు. గతంలో ఎస్.జె సూర్యతో ఒక సినిమాలో నటించిన మహేష్ ఇటీవలే మణిరత్నం సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. మరి వీరి కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు వుంటాదో చూడాలి

ప్రస్తుతం మురగదాస్ విజయ్, సమంతాలు నటిస్తున్న సినిమా మరియు అక్షయ్ కుమార్ నటిస్తున్న హిందీ సినిమా హాలిడే లతో బిజీగా వున్నాడు.

తాజా వార్తలు