శ్రేయా ఘోషల్ అంటే ఈ మధ్యాకాలంలో బాగా ఫేమస్ అయిన సింగర్, అలాగే బాగా బిజీగా ఉండే సింగర్ అని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం అవసరం లేదనుకుంటా.. ఇప్పటికే శ్రేయా ఘోషల్ తెలుగు, హిందీ, మరాఠీ, పంజాబీ, కన్నడ, తమిళం, మలయాళం, అస్సామీ అని భాష తేడా లేకుండా అన్ని భాషల్లోనూ పాడి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి తన ఖాతాలో వేసుకుంది.
శ్రేయా ఘోషల్ సంగీతంలో రారాజు ని చెప్పుకునే మాస్ట్రో ఇళయరాజా గురించి చెబుతూ ‘ ఇళయరాజా గారితో పనిచెయ్యడం మరచిపోలేని అనుభవం. చాలా మంది ఇళయరాజా గారికి కోపం ఎక్కువ అలాగే ఎవ్వరినీ ప్రశంసించరు అని చెప్పేవారు. కానీ అదృష్టం ఏమిటంటే ఆయన ఎప్పుడూ నన్ను తిట్టలేదు అలాగే నన్ను ప్రశంసించలేదు. కానీ ఆయన నన్ను తిట్టకపోవడాన్నే పెద్ద కాంప్లిమెంట్ గా తీసుకున్నాను. ఆయన దగ్గర నుంచి మొదట పిలుపు రాగానే ఎంతో హ్యాపీ గా ఫీలయ్యాను. సంగీతం అనేది ఒక పాఠశాల అయితే దానికి ఆయన ప్రిన్సిపాల్’ అని చెప్పింది.
అలాగే శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ ‘ నేను సింగర్ చిత్ర గారికి నేను భక్తురాలిని. ‘శ్రీరామ రాజ్యం’ సినిమాలో ఆమెతో కలిసి పాడే అవకాశం రావడం చాలా సంతోషాన్నిచ్చిందని’ తెలిపింది. శ్రేయా ఘోషల్ ఇలానే మరెన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి తెలుగు వారి మన్ననలు పొందాలని ఆశిద్దాం.