షాహిద్ కపూర్ తో జత కట్టనున్న ఇలియానా ?

షాహిద్ కపూర్ తో జత కట్టనున్న ఇలియానా ?

Published on Apr 7, 2012 1:03 PM IST

గత కొద్ది రోజులుగా ఇలియానాకి హిట్ చిత్రం పడలేదు అయినా కూడా నిర్మాతలు ఆమె వద్దకు మంచి పాత్రలు తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “దేవుడు చేసిన మనుషులు” చిత్రం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “జులాయి” మరియు అనురాగ్ బసు దర్శకత్వంలో “బర్ఫీ” చిత్రాలలో నటిస్తున్న ఈ భామకి తాజాగా తమిళ పరిశ్రమలో విజయం సాదించిన “వెట్టై” చిత్ర హిందీ వెర్షన్ లో నటించమని లింగుస్వామి సంప్రదించినట్టు తెలుస్తుంది.

ఆర్య,మాధవన్,సమీర రెడ్డి మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్ర హిందీ వెర్షన్ లో ఆర్య స్థానంలో షాహిద్ కపూర్ నటించబోతున్నారు. అమలా పాల్ స్థానంలో నటించడానికి ఇలియానాను లింగు స్వామి సంప్రదించినట్టు తెలుస్తుంది.

ఇలియానా కూడా ఈ పాత్రకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన చెయ్యలేదు. యుటివి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగులో “భలే తమ్ముడు” అనే పేరుతో వేసవికి విడుదల కానుంది.

తాజా వార్తలు